Thursday, May 2, 2024

వివేకా హ‌త్య కేసు – నా వ‌ద్ద ఆధారా‌లున్నాయిః ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ

అమరావతి, : ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు ఒక సంచలన లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి స్వర్గీయ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్నాయని సీబీఐకు ఆయన రాసిన లేఖ రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను వివరిస్తూ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆనాడు వివేకానంద రెడ్డి మరణా న్ని సహజ మరణంగా తొలుత చూపించారని సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఎవరిని ఇంటి లోపలికి అనుమతించ లేదని ఆరోపించారు. అంతేకాకుండా విభిన్న కథనాలను వినిపించారని పేర్కొన్నారు. అయితే ఆస్పత్రికి చేరే వరకు వివేకా మృతదేహం ఆయన బంధువుల ఆదీనంలోనే ఉందని పంచనామా తర్వాతే అది హత్యగా తేలిందన్నారు. కొందరు ఎంపీలు ఈ హత్య కేసును గుండెపోటు మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హత్య జరిగిన తర్వాత ఎటువంటి ఆధారాలు లభించకుండా నివాసాన్ని మొత్తం శుభ్రం చేశారని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించేవరకు వివేకా నివాసం ఎంపీ అవినాష్‌ రెడ్డి ఆదీనంలో ఉందని వెల్లడించారు. ఆ సమ యంలో తాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నానని ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి రా సిన లేఖలో పేర్కొన్నారు. హత్య సమాచారాన్ని అందుకున్న మీడియా, ఇంటెలి జెన్స్‌, పోలిస్‌ సిబ్బందిని సైతం వివేకా బంధువులు అనుమతించలేదని తెలిపా రు. ఇదే విషయంలో తాను గతంలోనే సీబీఐను సంప్రదించానని తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపినప్పటికీ స్పందన ఏమాత్రం లేదన్నారు. ఆనాడు సీబీఐ చీఫ్‌ ఎన్‌ఎం సింగ్‌ దృష్టికి తీసుకువెళ్లానని, రెండు సార్లు ఫోన్లో సంప్ర దించినా ఫలితం లేదన్నారు. కేసు దర్యాప్తుకు తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా కేంద్ర దర్యాప్తు బృందం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇప్పటికి వివేకా హత్య కేసును ఏడాది నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తుందని.. ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. తన వద్ద వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు. దీంతోనే ప్రభుత్వం ఆనాడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఉన్న తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించిందని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తుకు స్వచ్ఛందంగా సహకరిస్తానని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొనడం చర్చకు దారి తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement