Thursday, May 16, 2024

మేయ‌ర్లు రెడీ…మ‌హిళ‌ల‌కు పెద్దపీట‌..

డిప్యూటీ సీఎంల తరహాలోనే పురపాలక పదవులు
విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి,
తిరుపతికి శిరీష,
గుంటూరు కావటి మనోహర్‌ నాయుడు
విశాఖకు హరివెంకట కుమారి
తాడిపత్రి, మైదుకూరుల్లో వ్యూహాత్మక అడుగులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు.. పురపాలక సంఘాల మేయర్‌.. చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. తుది జాబితాను బుధవారం సాయంత్రానికే ప్రకటిం చాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ట్రంలోని 11 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 70 మునిసి పాల్టిలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. అన్ని కార్పొరేషన్లలో విజయకేతనం ఎగుర వేసింది. అయితే మేయర్‌ అభ్యర్థికి పలువురు పోటీ పడటంతో తీవ్ర స్థాయిలో వడపోత కార్య క్రమాన్ని నిర్వహించింది. మేయర్‌ , చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించటంతో పాటు ప్రాంతాల వారీగా బీసీలు, మహిళలకు పెద్దపీట వేసింది. రాష్ట్ర మంత్రి వర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం కల్పించారు. ఇదే తరహాలో నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మునిసిపాల్టిdలకు ఇద్దరు వైస్‌ చైర్మన్ల చొప్పున నియమించేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో గురువారం మేయర్‌, చైర్మన్‌ పదవులతో పాటు డిప్యూటీ మేయర్లు,వైస్‌ చైర్మన్ల ఎంపిక కూడా నిర్వహించాలనే యోచనలో ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ , చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక నిర్వహించారు. పదవుల పంపకాల్లో ఎలాంటి అరమరికలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ పార్టీ నేతలకు సూచించారు. పారదర్శకంగా జాబితా రూపకల్పన చేశారు. నగర పాలక మేయర్‌ పదవులకు సంబంధించి చిత్తూరుకు ఎస్‌ ఆముద, తిరుపతి మేయర్‌గా శిరీష, విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి, విజయనగరానికి విజయలక్ష్మి, గుంటూరు మేయర్‌ గా కావటి మనోహర్‌నాయుడు, అనంతపురానికి వసీమ్‌ సలీమ్‌, కడప మేయర్‌గా సురేశ్‌బాబు, కర్నూలుకు ఏవై రామయ్య, ఒంగోలు మేయర్‌గా సుజాత పేర్లు ఖరారు కాగా, విశాఖపట్నం మేయర్‌ పదవికి హరి వెంకట కుమారి ఖాయమైనట్టు సమాచారం. మచిలీపట్నం మేయర్‌ అభ్యర్థి ఎంపిక కూడా తేలాల్సి ఉంది. ఈ రెండు కార్పొరేషన్లలో నేతల మధ్య ఏకాభిప్రాయానికి సమన్వయ యత్నాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలు జరిగిన 70 మునిసిపాలిటీలకు చైర్మన్‌ల ఎంపిక కూడా 70 శాతం మేర పూర్తయింది. రాత్రి పొద్దు పోయే వరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా పలువురు నేతలు పెండింగ్‌లో ఉన్న స్థానిక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తాడిపత్రి, మైదుకూరు మునిసిపాల్టిdల్లో పాగా వేసేందుకు అధికార పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లతో ఈ రెండు మునిసిపాల్టిdలపై అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసే దిశగా అడుగులు వేస్తోంది. తాడిపత్రి మునిసిపాల్టి లో 36 వార్డులకు గాను 18 సీట్లలో టీడీపీ గెలుపొందింది. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కు 16 స్థానాలు రాగా మరో రెండు వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. ఎక్స్‌ అఫిషియోగా ఎమ్మెల్యే ఓట్లతో గట్టెక్కాలని తొలుత భావించింది. ఈ లోగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తనకు ఎక్స్‌ అఫిషియో గా ఓటుకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తాడిపత్రి చైర్మన్‌ పదవికి మార్గం సుగమం కాగలదని వైకాపా భావిస్తోంది. మైదుకూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement