Friday, May 24, 2024

గొల్లపుంతలో అగ్ని ప్ర‌మాదం..

మండపేట, (ప్రభ న్యూస్‌): పశువుల మేత కోసం ఖాళీ స్థలంలో వేసుకున్న గడ్డిమేటు దగ్దమైంది. మండపేట గొల్లపుంత కాలనీకి వెళ్లే రహదారిలో ఉన్న సంక వారి పశువుల చావిడి ఎదురుగా అవుట్లలో గడ్డివాము తారాజువ్వ పడి కాలి బూడిద అయింది. గొల్లపుంతకు చెందిన నీలపాల కొండ అనే రైతుకు ఆ ప్రాంతంలో పశువుల కోసం గడ్డి కుప్ప వేసుకున్నారు. సోమవారం నాగుల చవితి కావడంతో అక్కడకు ప్రజలు పుట్టలో పాలు పోయడానికి వెళ్లారు. ఆ క్రమంలో పిల్లలు టపాసులు వెలిగించడంతో తారాజువ్వ గడ్డిమేటు మీద పడి నిప్పు రాజుకుంది.

స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు హుటాహుటిన అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ గన్స్ తో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రెండెకరాల గడ్డి పూర్తిగా దగ్ధం కావడంతో రైతుకు  రూ.30 వేల నష్టం వాటిల్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement