Thursday, May 2, 2024

ఎగుమతులే లక్ష్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌.. మొత్తం ఏడు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు

అమరావతి,ఆంధ్రప్రభ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ఎగుమతులే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులు పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, ఆ కొనుగోలు చేసిన ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసేందుకు పరిశ్రమలను నెలకొల్పేందుకు మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పబోతున్నారు. అంతేకాక ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెద్ద ఎత్తున స్తాపించబోతున్నారు. ఇప్పటి వరకు 118 కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపాయి. 24 యూనిట్లకు భూమి స్వాధీనం కూడా పూర్తయింది. 25 యూనిట్లకు సమగ్ర ప్రాజెక్ట నివేదిక పూర్తయింది.

ఏడు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు..

రాష్ట్రంలో బాగా పండుతున్న వివిధ వ్యవయోత్సత్తులను ప్రాసెస్‌ చేసి, విదేశాలకు ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏడు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించింది. గల్ఫ్‌ మరియు ఇతర దేశాలకు పండ్ల గుజ్జును ఎగుమతి చేసేందుకు రెండు మెగా ఫ్రూట్‌ పల్ప్‌ యనిట్లుు, మొక్కజొన్న ఆధారిత ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు రెండు మెగా మొక్కజొన్న ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక మెగా స్పైసెస్‌ పార్క్‌ను, కొబ్బరి విలువ జోడించిన ఉత్పత్తులను తయారు చేయడానకి ఒక మెగా కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక మెగా అరటిపండు ప్రాసెసింగ్‌ యూనిట్‌ మురియు ఒక మెగా జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు కోకో, కాఫీ, టోమాట, స్వీట్‌ ఆరెంజ్‌, ఉల్లిపాయలు, గిరిజన ఉత్పత్తులు, చింతపండు, వేరు శెనగ, కందిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి పార్లమెంట్‌లో ఏర్పాటు చేసే సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సంస్థలకు ఫ్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో లీజుకు ఇస్తారు. ఈ సంస్థలు రైతులకు ఎంఎస్‌పి, మార్కెట్‌ రేటు ఇవ్వడంతోపాటు ప్రభుత్వంతో ఆదాయాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు మద్దతు

- Advertisement -

పెద్ద పెద్ద యూనిట్లతోపాటు మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. ఇందులో భాగంగా 2022-23 బడ్జెట్‌లో వీటి క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దాదాపు 3602 వ్యక్తిగత మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను సాంకేతికంగా శిక్షణ నివ్వడంతోపాటు ఆర్దిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో నిమగ్నమైన పది వేల మంది ఎన్‌హెచ్‌జి మహిళలకు ఉత్పత్తి సామర్ధ్యాలు పెంచేందుకు సీడ్‌ క్యాపిట ల్‌ సహాయాన్ని అందించనున్నారు. పండ్లు, కూరగాయల విలువ జోడింపులో యువత మరియు రైతులను ప్రొత్సహించేందుకు రాష్ట్రంలో 14 వేల మంది సభ్యులకు ప్రత్యేక శిక్షణ నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement