Thursday, May 2, 2024

ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తుతున్న వరద ఉధృతి

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : కృష్ణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం కృష్ణానదికి 80వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండడంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ సామర్థ్యం మూడు టీఎంసీలు నిండిన నేపథ్యంలో 12 అడుగుల నీటి నిల్వను ఉంచుతూ మిగిలిన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయానికి 80వేల క్యూసెక్కులకు చేరుకుంది. సాయంత్రానికి ఈ ఉధృతి లక్ష క్యూసెక్కులు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నీటి ప్రవాహం దిగువకు విడుదల చేసిన క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గస్తీని ముమ్మరం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement