Wednesday, May 25, 2022

ఫ్లాష్ .. ఫ్లాష్.. : పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోరం జ‌రిగింది. ఇంట‌ర్ ఎగ్జామ్స్ రాస్తుండ‌గా ఓ విద్యార్థి ప‌రీక్షా కేంద్రంలోనే చ‌నిపోయిన ఘ‌ట‌న ఇవ్వాల జ‌రిగింది. గూడూరులో బుధవారం ఇంటర్ పరీక్ష రాస్తున్న సైదాపురంకు చెందిన సతీష్ ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో కుప్ప కూలిపోయాడు.. ఆ విద్యార్థి పరీక్ష రాస్తుండగా గుండెపోటు వచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప‌రీక్షా కేంద్ర‌లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం చెల‌రేగింది. విద్యార్థులంతా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ విషయం తెలిసి ఆర్​ఐవో హుటాహుటిన గూడూరుకు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement