Tuesday, May 7, 2024

Fake Voters – ఏపీలో తొండాట! ప్రత్యర్థుల ఓట్ల తొలగింపే లక్ష్యం

ఓట్ల తొలగింపు.. చేర్పుల అంశం కాస్త రచ్చ.. రచ్చగా మారింది. ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు చావో రేవోగా మారాయి. దీంతో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికారమే లక్ష్యంగా సామ, దాన, దండోపాయాలతో ప్రధాన పార్టీలు దిగడంతో అధికారులకు విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. జిల్లాలో ఓట్ల తొలగింపు పేరిట ఆన్ లైన్లో వేల సంఖ్యలో తప్పడు దరఖాస్తులు అందినట్లు చెబుతున్నారు. తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు.

(ప్రభన్యూన్, బ్యూరో- కృష్ణా)
ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే జిల్లా రాజకీయాలు కాకపుట్టిస్తు న్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుతో ముఖాముఖి పోటీ కనిపిస్తుంటే.. తాజాగా కాంగ్రెస్ నేను సైతం అంటూ జూలు విదుల్చుతోంది. ఇక బీజేపీ, సరేసరి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముం దుకు సాగుతున్నాయి. ప్రతి చిన్న అం శాన్ని రాజకీయ కోణంలో చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్​లో అనేక జిల్లాల్లో.. ఓట్ల చేర్పులు, తీసివేతలు జగడాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు.. అధికారుల గుండెల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఓట్ల తొలగింపునకు ఫార్ 7 వినియోగంలో.. అన్ని రాజకీయ పార్టీలు తప్పుడు సమాచారంతో రెచ్చిపోయాయి. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దొంగ ఓట్ల నమోదుపై అధికార పార్టీ గళం విప్పింది. జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు చేసింది. ఇక టీడీపీ ఎక్కడా తగ్గలేదు. తమ పార్టీ ఓటర్ల పేర్లను తొలగించటానికే అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందని, అసలు దొంగ ఓటర్లను పసిగట్టి జాబితా నుంచి తొలగించాలని టీడీపీ గోల చేస్తోంది.

కృష్ణాజిల్లాలో దరఖాస్తులను పరిశీలిస్తే..

కృష్ణా జిల్లాలో ఓటర్ల చేర్పులు, మార్పులు , తొలగింపుల కోసం 1,03,131 దరఖాస్తులు చేరాయి. ఇందులో ఓట్ల తొలగింపునకు ఫారం- 7 దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకు పోయాయి. కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ఓట్లు తొలగించాలని, ఇందులో అత్యధికులు తెలంగాణలో ఓటర్లు ఉన్నారని 31,061 దరఖాస్తులు అందాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా 8,704 దరఖాస్తులు అందగా, అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,820 దరఖాస్తులు అందాయి. వీటిలో ఎక్కువ శాతం ఫేక్ దరఖాస్తులు కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలి. ఆ దిశగా ఓటర్ల జాబితా తయారీలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లు ఎక్కడ తొలగిస్తారో అనే ఆందోళన సాధారణ ప్రజల్లో నెలకొంది.

ఆన్​లైన్​ విధానానాకి శ్రీకారం చుట్టినా..
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆన్ లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఎన్ని కల సంఘం కల్పించింది. ఆన్ లైన్ విధానాన్ని అవకాశంగా తీసుకుని ఓట్ల తొలగింపునకు తమకు గిట్టనోళ్లపై ఫారం -7 దరఖాస్తులు చేసినట్లు అధికారులు గుర్తించారు. కృష్ణాజిల్లా ఓటర్ల జాబితాలోని 11,125 మంది తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య ( నాని) ఆరోపించారు. గ్రామీణ ప్రాంత ఓట్లు పట్టణ ప్రాంతాల్లో నమోదుకాగా, 15వేల మందికి రెండు నియోజకవర్గాల్లో 15 వేల మందికి ఓటు హక్కు ఉందని నాని ఆరోపించారు. ఈ . రెండు చోట్ల ఓట్లు ఉన్న పేర్లను తొలగించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఇది సరే మచిలీపట్నంలో ఓకే డోర్ నెంబర్ లో 70 ఓట్లు ఉన్నాయని, అంశంపై దర్యాప్తు చేయాలని టీడీపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఇరు పార్టీల ఆరోపణలు..
ఈ ఓట్ల తొండాటలో టీడీపీ, వైసీపీ నీవు దొంగ అంటే నీవు దొంగ అంటూ పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. ఎవరికి వారే రాజకీయ మైలేజీకి ఆరాటపడుతున్నాయి. కాగా ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగించాలని ఎవరు ఫారం-7ను దరఖాస్తు చేసినాకఠిన చర్యలు తీసు కుంటామని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ అవసరంఉంది. లేనిపక్షంలో వాస్తవాలు మరుగునపడే ప్రమాదం ఉందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement