Friday, December 6, 2024

Last Rites – ఆ ఐదుగురు…కన్నీళ్లతో నాన్నకు

అందరూ ఆడపిల్లలే… అని బంధువులు ఒకటే గోల పెడుతుంటే ఆలుమగలు మాత్రం ఏనాడు బాధపడలేదు. ఎట్టకేలకూ ఒక మగబిడ్డను కన్నారు. ఆరుగురు బిడ్డలతో అన్యోన్య కుటుంబం ఎక్కడా బాధపడలేదు. ఆరుగురు చిన్నారులను చదువు సంధ్యల్లో తీర్చిదిద్దారు. కానీ చివరకూ విధి కాటేసింది. వారసుడిని ప్రమాద రూపంలో దూరం చేసింది. ఇక ఈ తండ్రి అనారోగ్యంతో మరణించగా.. తలకొరివి పెట్టే వారసుడు లేడు.

ఆడబిడ్డల కన్నీటి వేదన..
కానీ ఐదుగురు ఆడబిడ్డలు కన్నీటితో తల్లడిల్లిపోయారు. తన తండ్రి అంతిమక్రియలను తామే నిర్వహిస్తామని పట్టుబట్టారు. అంత్యక్రియలు చేపట్టి సభ్య సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఆకాల మరణం గుండెను పిండి చేస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో అంతిమ సంస్కారంలో అన్ని తామై ఐదుగురు కుమార్తెలు నిర్వహించారు. మణుగూరు మండలం రాజుపేట గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన నరసింహారావు , గోపమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. నరసింహారావు సింగరేణి విశ్రాంత ఉద్యోగి. ఉద్యోగ కాలంలో తనకు ఉన్నంతలో ఆరుగురు పిల్లలని ఉన్నత చదువులు చదివించారు. రెండేళ్ల కిందట ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడు. అప్పటి నుంచి అన్ని తామై ఆ కుమార్తెలు అమ్మానాన్నలను చూసుకుంటున్నారు. నరసింహారావు సోమవారం తెలవారుజామున గుండె నొప్పితో బాధ పడుతుండగాహాస్పటల్‌కి తరలించారు.

ట్రీట్​మెంట్​ జరుగుతుంటేనే..
చికిత్సక్రమంలోనే నరసింహ రావు కన్నుమూశారు. ఇంట్లో మగ పిల్లలు ఎవరు లేకపోయే సరికితమ తండ్రీ అంత్య క్రియలను ఈ ఐదుగురు కుమార్తెలు నిర్వహించారు. తండ్రికి తుది వీడ్కోలులో పెద్ద కూతురు తలకొరివి పెట్టగా, మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు.. దటీజ్ ఆడపిల్ల. కంటే ఆడపిల్లనే కనాలి.. బాధపడొద్దని ఈఘటన సభ్యసమాజానికి సంకేతం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement