Saturday, May 21, 2022

తిరుమల వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు.. చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రికి 130 కోట్లు విరాళం

తిరుమల, ప్రభన్యూస్‌ : వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్ధం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఈవో ముందుగా భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఏప్రిల్‌ 15 నుంచి జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు పరిమితం చేశామని, తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారని చెచ్చారు. అలాగే క్యూ లైన్‌లు, కంపార్టు మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తుమని తెలిపారు. ఆలయ మాడవీధుల్లో భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్ళు, చలువ సున్నం, కార్పెట్లు వేశామని తెలిపారు.

నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా తిరుమలలో ఈనెల 25 నుంచి 29 వ తేది వరకు హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని, హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలోని ఆకాశ గంగ వద్ద, జపాలితీర్ధం, నాదనీరాజం వేధి, ఎస్వి వేద పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మే 29 న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరగనుందని చెప్పారు. దాదాపు 200 మంది వేద పండితులు 18 గంటల పాటు 2800 శ్లోకాలను పారాయణం చేస్తారని పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయస్వామి జన్మస్థలానికి సంబంధించి ఆధారాలతో సమగ్ర గ్రంధాన్ని తెలుగు, ఇంగ్లీష్‌, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ముద్రించడం జరిగిందని చెప్పారు. త్వరలో ఈ గ్రంధాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకవస్తామని తెలిపారు. కాగా గత ఏడాది నవంబర్‌ నెలలో కురిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని యుద్దప్రాతిపదికన పునరుద్దరించి భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ మెట్టు మార్గానికి రూ.3.60 కోట్ల వ్యయంతో కేవలం నాలు నెలల వ్యవధిలో పూర్తి చేసి ఈనెల 5 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ద ర్శనార్దం వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో పాటు విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది.

ఇందులో భాగంగా అలిపిరి వద్ద ఆరు ఎకరాల స్థలంలో రూ.300 కోట్ల వ్యయంతో 7 అంస్తులతో 350 పడకలతో నిర్మించనున్న చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, అదేవిధంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండవెంగమాంబ బృందావనంలో దాత సహకారంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 350 మంది భక్తులు కూర్చుని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ధ్యాన మందిరం నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే అధునిక సదుపాయాలతో దాత సహకారంతో రూ.18 కోట్ల ఖర్చుతో పరకామణి నూతన భవనం నిర్మిస్తున్నామని, మూడు నెలలో ఈ భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు, డిల్లిdలోని శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలకు ఇటీవల నాక్‌ఎప్లస్‌ గ్రేడ్‌ గుర్తింపు లభించింది. ఇందుకు కృషి చేసిన అధికారులను, అద్యాపక సిబ్బందిని ఈ సందర్భంగా ఈవో అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement