Sunday, April 28, 2024

Exclusive – జగ్గయ్యపేటలో మారుతున్న రాజకీయ సమీకరణలు – వైసిపి, టిడిపి మధ్య టఫ్ ఫైట్

(ప్రభన్యూస్, జగ్గయ్యపేట)జగ్గయ్యపేటలో అధికార వైసీపీ, ప్రధాన ఉమ్మడి ప్రతిపక్షం టీడీపీ జనసేన నేతలు వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని, బలగాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను ఆకర్షించేందుకు మిషన్ ఆకర్ష్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామస్థాయి, వార్డు స్థాయి లో ప్రభావం చూసే నాయకులను సత్తా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను తమ పార్టీలో చేర్చుకునే విధంగా వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు.

ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి నుంచి కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు చేరారు. దీనికి ప్రతి చర్యగా అదే గ్రామం నుంచి అధికార వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు , బుద వాడ జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తదితర గ్రామాల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలలోకి వలసల ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ అసెంబ్లీ ఎన్నికలను ఇరు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో జోరుగా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కండవాలు జెండాలు మార్చుతున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ పట్టణంలోని ప్రతి వార్డులోనూ ప్రత్యర్థి పార్టీలలో అసమ్మతి వర్గాలను గుర్తించి, చర్చిస్తూ తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. ఆయా రామ్.. గయా రామ్ కహానీలు ఇక ఈ ఎన్నికల వేళ వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల మద్దతును పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ స్థితిలోనే వివిధ రాజకీయ పార్టీల్లో ఆయా రామ్…గయా రామ్ కథలు వెలుగులోకి వస్తున్నాయి. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి యాదవ్ కార్యకర్తలు ఇటీవల జోరుగా కండవాలు మారుస్తున్నారు. పార్టీల మారిన వారిని తిరిగి మళ్లీ సొంత పార్టీకి తెచ్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తూ ఆయా పార్టీల నాయకులు ముందుకు వెళ్తున్నారు. గ్రామస్థాయి మండల స్థాయి నాయకుల కదలికలపైనా ఆయా పార్టీలు దృష్టి సారించాయి. గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు ఎవరెవరిని కలుస్తున్నారు. ఎటు వెళ్తున్నారు అనే కోణంలో నియోజకవర్గస్థాయి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు

.అసమ్మతి వర్గాలు సొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా స్తబ్దత గా ఉంటున్నారా అసంతృప్తితో ఉన్నారా అన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అసమ్మతి వర్గాలను గుర్తించి నేరుగా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వలసలను ప్రోత్సహించే విధంగా నేతలు ఎత్తుకు పైఎత్తులతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు గాలం వేస్తూ సొంత పార్టీ నేతలు జారిపోకుండా జాగ్రత్తలతో అసంతృప్తులను బుజ్జగించే విధంగా వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నారు

- Advertisement -

అక్కా చెల్లెమ్మలకే… దండాలు దస్కాలు

జగ్గయ్యపేట నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కీలకం కావటంతో ఇరు పార్టీల నాయకులు మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వంలనే మేలు జరిగిందని తమ ప్రభుత్వ హయాంలోని నిజమైన మేలు జరిగిందంటూ ప్రచారాన్ని చేపట్టారు.

జగ్గయ్యపేట నియోజకవర్గం లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,407 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,05,166మంది మహిళలు ఓటర్లు ఉన్నారు. 97,229మంది పురుష ఓటర్లు ఉన్నారు. అంటే 7,937మంది మహిళా ఓట్లు అత్యధికంగా ఉన్నారు. అందుకే మహిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

నా హయాంలోనే అభివృద్ధి:

తాను ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచానని తన హయాంలోనే జగ్గయ్యపేట సమగ్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు ప్రభుత్వ విప్ ఉదయభాను స్పష్టం చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం, సాగునీటి కాలువలు అభివృద్ధి, జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధి,కేవలం గతంలోతాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ, ప్రస్తుత తన హయాంలోనే జరిగిందని సామినేని ఉదయభాను వాదిస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్ష నేత శ్రీరామ్ తాతయ్య హయాంలో అభివృద్ధి జరగలేదని, ఈ అంశంపై తాము చర్చకు సిద్ధమన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు తెలియజేస్తూ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునేందుకు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ఉదయభాను పాల్గొంటున్నారు

సరే చర్చకు సిద్ధం: శ్రీరాం తాతయ్య,

జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఉదయభాను సవాలను తాను స్వీకరిస్తున్నానని, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు. తన హయాంలోనే జగ్గయ్యపేట సమగ్ర అభివృద్ధికి కృషి జరిగిందని ప్రతి సవాల్విసిరారు. ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గ్యారంటీ లో ఇచ్చిన హామీల పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో అండగా ఉండాలని కోరుతున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతో సాధ్యమని పేర్కొంటున్నారు.ప్రభుత్వ పై విమర్శలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత జరిగిన ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధిపై నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వివరిస్తూ మరో వైపు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ముందుకు వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement