Saturday, May 11, 2024

AP | హాస్టల్లోనే విద్యార్థిని ప్రసవం.. అధిక రక్తస్రావంతో మృతి

కర్నూలు బ్యూరో (ప్రభ న్యూస్): నంద్యాల జిల్లాలోనీ పాణ్యం లో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల వసతి గృహంలో అనుమానాస్పద మృతి చెందారు. హాస్టల్ బాత్ రూంలో తీవ్ర రక్తస్రావంతో చనిపోయారు. విద్యార్థిని బిడ్డని కని మృతి చెందినట్లు గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన బయటకు పోకుండా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి.

కల్లూరు మండలం చెట్ల మల్లాపురం గ్రామానికి చెందిన ఉమా మాధురి అనే విద్యార్థిని పాణ్యం ఆర్ జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ సెకండియర్ విద్యను అభ్యసిస్తున్నారు. కాగా శుక్రవారం సంబంధిత విద్యార్థి తనకు కడుపునొస్తుందని బాత్రూం కి వెళ్లినట్టు సమాచారం. అయితే ఎంతకీ ఆ విద్యార్థినీ తిరిగి రాకపోవడంతో తోటి హాస్టల్ కళాశాల విద్యార్థునులు బాత్రూం కి వెళ్లి చూశారు.

అయితే బాత్రూంలో ఉమా మాధురి రక్తం మడుగులో పడి ఉంది. పక్కనే ఆడ శిశువు ఉండటంను గమనించి కళాశాల వసతి గృహం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. మృతిచెందిన ఉమాదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అధిక రక్తస్రావంతో మృతి చెందినట్లు గుర్తించారు. అయితే ఆమె గర్భం దాల్చి 9 నెలలు నిండిపోవటంతో బాత్‌ రూమ్‌లోనే ప్రసవించినట్లు తెలుస్తోంది. పండంటి పాపకు ఆమె జన్మనిచ్చినట్లు సహ విద్యార్థులు చెబుతున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే మాధురిని మోసం చేసింది ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు మాధురి గర్భం విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement