Tuesday, May 7, 2024

గ్రంధాలయవారోత్సవాలు…

మండపేట : శాఖా గ్రంధాలయంలో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి బాల మాట్లాడుతూ..ఆదివారం నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న పుస్తక ప్రదర్శన,  16న 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవాలు ,ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. స్వాతంత్య్ర గాథలపై, పోరాట యోధులపై ప్రముఖులతో ప్రసంగాలు ఉంటాయని తెలిపారు.17న భారత స్వాతంత్రోద్యమం గురించి కవి సమ్మేళనం 18న వ్యక్తిత్వ వికాస దినోత్సవం విద్యార్థులకు భారత స్వాతంత్య్ర చరిత్రపై పోటీలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. 

(జూనియర్‌, సీనియర్‌ విభాగాలకు) వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, క్విజ్‌, ఇతర పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో మహిళల పాత్ర, ఆధునిక మహిళా వికాసం-పలు సవాళ్లు-చర్చాగోష్టి (మహిళా దినోత్సవం) నిర్వహిస్తున్నామని తెలిపారు. 20న ముగింపు ఉత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు.  సామూహిక పుస్తక పఠనం ,బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వోన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయులు పి షాలేం రాజు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎన్ భాస్కర రావు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ. మారేశ్వరరావు  , రిటైర్డ్ గ్రంథాలయ అధికారి ఉద్యోగసంఘ అధ్యక్షులు జి.రామారావు  , పాఠకులు,విద్యార్థులుపాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి   ఎన్.బాల అధ్యక్షత వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement