Friday, December 6, 2024

క‌ర్నూలు టీడీపీలో వ‌ర్గ విభేదాలు.. క‌త్తులు, రాళ్ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు

క‌ర్నూలు టీడీపీలో వ‌ర్గ విభేదాలు త‌లెత్తాయి. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ తలెత్తింది. ఆదోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావాజీ పేటలో ఇరువర్గాల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకొన్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తిమ్మప్ప వర్గం, అదే పార్టీకి చెందిన వెంకటేష్ వర్గం మ‌ధ్య ఈ అల్ల‌ర్లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆదోని మండల పరిధిలోని సంతేకుల్లూరు గ్రామానికి వాల్మీకి విగ్రహ ప్రతిష్టకు ఈ రెండు వ‌ర్గాల వారు వెళ్లారు.

అయితే తిమ్మప్ప వర్గం వారు వెంకటేశ వర్గం వెళ్తున్న కార్లపై వాటర్ బాటిళ‌ల్ఉ విసరడంతో పరస్పరం ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బావాజీ పేటలో ఇరువర్గాల మధ్య కత్తులు, రాళ్లతో దాడి జ‌రిగింది. తిమ్మప్ప వర్గానికి చెందిన ఎనిమిది మందికి, వెంకటేష్ వర్గానికి చెందిన పదిమందికి గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఘర్షణలు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా ఒకటో పట్టణ సీఐ విక్రమసింహ బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement