Monday, April 29, 2024

వజ్రాల వేట… పొలాలు ధ్వంసం – గగ్గోలు పెడుతున్న రైతన్నలు

తుగ్గలి జులై 23 (ప్రభ న్యూస్) గత రెండు రోజుల నుండి మండలంలో కురుస్తున్న వర్షాలకు ఆదివారము జొన్నగిరి గ్రామంలో వజ్రాల వెతికెందుకు ప్రజలు తండోపతండాలుగా తరలిరావడం జరిగింది. ప్రస్తుతము వర్షాలు రావడంతో పాటు ఆదివారము సెలవు దినం కావడంతో కర్నూలు, ఆదోని, బళ్లారి, గుత్తి, గుంతకల్, ప్రకాశం, గుంటూరు, ప్రాంతాల నుండి ప్రజలతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ద్విచక్ర వాహనాలు, కార్లు ,జీపులు తదితర వాహనాల్లో వచ్చే వజ్రాల ను వెతుకుతున్నారు. రైతులు పొలాల్లో విత్తనం వేయడం జరిగింది. అయితే ఆ పొలాల్లో వజ్రాలు వెతుకుతుండడంతో విత్తనం మొలక ఎత్తడం లేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

కొందరు వజ్రాల వెతికెందుకు వచ్చిన వారు రైతులపై కూడా దౌర్జన్యం చేస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.వివిధ ప్రాంతాల నుండి భారీగా జనాలు తరలివచ్చి పొలాల్లో వజ్రాలు వెతుకుతుండడంతో తమ పంటలు నష్టపోతున్నాయని రైతులంతా కలిసి పొలాల్లో వజ్రాలు వెతికే వారిని అక్కడ నుండి పంపించడం జరిగింది. విత్తనాలు వేసిన పొలాల్లో వజ్రాల వెతికితే పోలీస్ స్టేషన్లో కేసులు పెడతామని రైతులు పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ రైతులు పొలాల్లో లేని సమయంలో కొందరు వజ్రాల వెతుకుందుకు వెళ్లి రైతు సాగుచేసిన పంటలను ధ్వంసం చేస్తున్నారు. అందువల్ల పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కొత్తవారిని గ్రామాల్లోకి రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement