Friday, May 3, 2024

కోసిగిలో భారీ చోరీ – తాళాలు వేసిన ఇళ్లే కేటుగాళ్ల టార్గెట్

కోసిగి,జులై23 (ప్రభ న్యూస్ ) మండల కేంద్రమైన కోసిగిలోని పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నివాసం ఉంటున్న పురోహితుడు ఎమ్,జె స్వామి నివాసంలో భారీ దొంగతనం జరిగింది.స్వామి ఈ నెల 14 తేదీన హెల్త్ చెకప్ కోసమని బెంగుళూరుకు వెళ్ళివుండగా అదే అదనుగా భావించిన దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి జొరబడి బీరువాలోని రెండున్నార కేజీల వెండి, ఇతర వెండి ఆభరణాలు,బంగారు పూత పూసిన వెండి డాబు, 50 వేల రూపాయల నగదును దోచుకొని వెళ్లినట్లు బాధితుడు స్వామి తెలిపాడు.

ఆదివారంనాడు ఉదయం అటుగా వెళుతున్న కాలనీ వాసులు ఇంటి బయట తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చూసి ఇంటి యజమాని స్వామికి ఫోన్ చేసి చెప్పారు.అలాగే పోలీసుల కు కూడా సమాచారం ఇచ్చారు.స్వామి బెంగళూరు నుండి కోసిగికి చేరుకొని ఇంట్లో అంతా పరిశీలించి దొంగలు దొంగలించుకు పోయిన నగలు,నగదు వివరాలు తెలిపారు,

ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ సేకరించారు. కోసిగిలో వరుస దొంగతనాలతో గ్రామ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.ఈ నెల 20 వతేదీన కోసిగికి చెందిన దాస సుజాత ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన మరువక ముందే ఏకంగా గ్రామ పురోహితుని ఇంట్లో దొంగతనం చేయడం గ్రామంలో చర్చనీయంశంగా మారింది.కోసిగి లో తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నా కేటుగాళ్ళు కోసిగి వాళ్ళ లేక బయటి వాళ్ళ తెలవాల్సివుంది.పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని పెంచి వరుస దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పోలీసుల వైఫల్యం వలననే కోసిగిలో వరుస దొంగతనాలు

- Advertisement -

మండల కేంద్రమైన కోసిగిలో పోలీసుల వైఫల్యం వలననే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికి వరకు తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ చాలా దొంగతనాలు జరిగినప్పటికీ పోలీసులు సరిగా స్పందించ కుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తూ, చాలా లైట్ గా తీసుకుంటున్నారని పలువురు అంటున్నారు. రాత్రి బీట్ తిరిగే పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ గత సంవత్సర కాలంగా గ్రామంలో జరిగే వరుస దొంగతనాలను అరికట్టలని వారు కోరుతున్నారు. అలాగే లక్షలాది రూపాయలు వెచ్చించి కోసిగిలో అన్ని కూడళ్లలో ఏర్పాటు చేసిన సిసీ కెమరాలను మరమ్మత్తులు చేయించి పునరుద్ధరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement