Tuesday, May 14, 2024

క్రికెట్ లో పోటీతత్వం మరింత సంతరించుకుంది.. 300 మంది ప్లేయర్ల ఫిట్నెస్ కోసం అలవెన్స్

విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : క్రికెట్ లో ప్రస్తుతం మరింత పోటీతత్వాన్ని సంతరించుకుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మంగళవారం ఓ హోటల్ లో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి తో కలిసి రోజర్ బిన్నీ మీడియాతో మాట్లడుతూ.. 2023 ప్రపంచకప్‌ ను గెలుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అయితే ఏ పక్షమూ తేలికగా తీసుకోరాదని, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రతి జట్టుకు సత్తా ఉందన్నారు. ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ 300 మంది అండర్ 14, 15, 16, 19 ప్లేయర్ల ఫిట్నెస్ కోసం నెలకు రూ. 3 వేల చొప్పున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా ఆంధ్ర నుంచి దేశానికి ఆడిన 11 మంది యువ క్రికెటర్లు ఎస్.మేఘన, కె. అంజలి శ్రావణి, బి.అనూష, కె. నితీష్ కుమార్ రెడ్డి, ఎండీ షబనం, జి. హనుమ విహారి, కె.ఎస్. భరత్, రిక్కీ బోయ్, కె.వి.శశికాంత్, కె. రత్నకుమారి (ట్రైనర్), కె. నవజీవన్ (వీడియో అనలిస్ట్)లకు రూ. 65 లక్షలనగదు పురస్కారం అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా త్వరలో ఇంటర్ స్కూల్ నిర్వహిస్తామని అన్నారు. అండర్ 14, 19 క్రికెట్ లో ప్రతిభ చూపిన 20 మందిని ఎంపిక చేసి ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement