Sunday, May 12, 2024

రేపు నెల్లూరు పర్యటనకు సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి కడప వెళ్ళి.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి చేరుకోనున్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (మెరిట్స్‌) వద్ద జరిగే అంత్యక్రియల్లో పాల్గొని అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement