Sunday, May 5, 2024

Flash: వైసీపీలో వర్గ పోరు.. కర్నూలులో ట్రేడ్ యూనియన్ లీడర్ పై కత్తితో దాడి

కర్నూలు నగరంలోని వైసిపిలో వర్గపోరు భగ్గుమంది. బుధవారం మధ్యాహ్నం వైసిపి ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ లీడర్ విజయ్ కుమార్ పై అదే పార్టీకి చెందిన మద్దూర్ నగర్ కు చెందిన వైసిపి నేత బంధువు శ్రీధర్ కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో విజయ్ కుమార్ కు మేడ పైన.. ఎడమ భుజంపై కత్తితో పొడిచిన గాయాలు కాగా అతని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించారు. ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement