Monday, May 6, 2024

క‌లెక్ట‌రేట్ ఏర్పాటుపై జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు చెందిన పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై.. జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే కు.. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. తాత్కాలికంగా కలెక్టరేట్‌ ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తిరుపతి పద్మావతి నిలయంలో కొత్త కలెక్టరేట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంపై భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటు వద్దని హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చింది. సింగిల్‌ జడ్జి స్టేపై ప్రభుత్వం ధర్మాసనంలో అప్పీల్‌కు వెళ్లింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు బెంచ్‌ ఉత్తర్వులపై భానుప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్​పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement