Sunday, April 28, 2024

ప్రజల పక్షాన పోరాడుతాం.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం : కాంగ్రెస్ నేత రాకేష్ రెడ్డి

తిరుపతి సిటీ : ప్రజల పక్షాన పోరాడి, కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోచారెడ్డి రాకేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం, రాష్ట్ర రాజధాని అమరావతి ,రైల్వే జోన్, తీసుకుని వచ్చే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని వివరించారు. అలాగే యువజన విభజన చట్టంలోని 18 హామీలు నెరవేరాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, విశాఖ స్టీల్ ప్లాంట్. ఎయిర్పోర్ట్ , ప్రభుత్వ సెక్టార్లన్నీ అమ్మి పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికలు చూపించి అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బాగుండాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. గుజరాత్ లో మాత్రమే బీజేపీ విజయం సాధిస్తే సరిపోదని మిగతా రాష్ట్రాల్లో వెనుకబడి ఉందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి 21, ఎంపీలు ఇచ్చిన రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ గురించి రాష్ట్రాన్ని గురించి పార్లమెంట్లో అడిగే పరిస్థితిలో లేదన్నారు. లక్ష కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే రాష్ట్రాన్ని 8:30 లక్షల కోట్లు రూపాయలకు అప్పుల్లోకి తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని తెలియజేశారు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైఎస్ఆర్సిపి పార్టీకి జనసేన పార్టీకి ఓట్లు వేస్తే బిజెపి పార్టీకి ఓట్లు వేసినట్లే అని ఈ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఇటీవల భారత్ జోడి యాత్ర రాహుల్ గాంధీ నిర్వహించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటం చేసి పార్టీని పూర్వ వైభవం తీసుకువస్తామని. తమకు ఏ పార్టీతో పోత్తు ఉండదని ప్రజలే తమకు పొత్తు అని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement