Thursday, April 18, 2024

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈనెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసు పనులను సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు తాజాగా పరిశీలించారు. కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన కేసీఆర్.. ప‌లు సూచ‌న‌లు చేశారు. యాగం, పూజ‌లు జ‌రుగుతున్న ప్ర‌దేశాల‌ను కేసీఆర్ సంద‌ర్శించారు. అనంత‌రం స‌ర్దార్ ప‌టేల్ మార్గ్ నుంచి వ‌సంత్ విహార్‌కు వెళ్లారు సీఎం. అక్క‌డ నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ భవ‌నాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలించారు. అన్ని ఫ్లోర్ల‌ను క‌లియ తిరిగిన కేసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేశారు.

ముఖ్య‌మంత్రి వెంట రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశ‌వ‌రావు, నామా నాగేశ్వ‌ర్ రావు, సంతోష్ కుమార్, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని రేపు మ‌ధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంట‌ల మ‌ధ్య‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. కేంద్ర కార్యాల‌యంలో మొద‌ట కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం కార్యాల‌యం ప్రారంభోత్స‌వం చేసి, కేసీఆర్ త‌న గ‌దిలో కూర్చుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement