Sunday, April 28, 2024

89కేసుల్లో వాంటెడ్ స్మగ్లింగ్ బ్రదర్స్ అరెస్ట్..

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : వివిధ జిల్లాల్లో దాదాపు 89కేసులున్న వాంటెండ్ స్మగ్లర్లను అరెస్టు చేసి, 31ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక  టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. విలేకరులతో ఆయ‌న‌ మాట్లాడుతూ… వీరిద్దరిని కడప జల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చెంపతిలాల్ బాషా (36), షేక్ చంపతి జాకీయర్ (27)లుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిద్దరూ సోదరులని, వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. వీరి కోసం కొంతకాలంగా చేపట్టిన వ్యూహం ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపారు. డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ చక్రవర్తి అద్వర్యంలో సీఐ రామకృష్ణ, ఆర్ఐ చిరంజీవులు టీమ్ ఏర్పేడు సమీపంలోని కృష్ణాపురం, మల్లెమడుగు, కరకంబాడి ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.

కరకంబాడి ఫారెస్ట్ బీట్ అమర్ రాజా ఫాక్టరీ విన్జియో కంపెనీ వద్ద కారుతో నిలబడి ఉన్నవారు గమనించారు. వీరిని సమీపించడంతో పారిపోవడానికి ప్రయత్నించారు. ఆర్ఎస్ఐ రాఘవేంద్ర మరికొంత మంది పోలీసులు చుట్టుముట్టి పట్టుకో గలిగారు. వీరిని అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించారు. వీరి నుంచి 31ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. కారులో పోలీసు యూనిఫాంను కూడా కనుగొన్నారు. వీరు పోలీసు యూనిఫాం వేసుకుని స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను హైజాక్ చేసి, ఇతర రాష్ట్రాలకు అమ్మేవారని తెలిపారు. 31ఎర్రచందనం దుంగల విలువ రూ.20లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, బాలకృష్ణ, రామకృష్ణ, ఎఫ్ఆర్వోలు, ఎస్ఐ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement