Monday, May 6, 2024

రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలం: మంత్రి రోజా

తిరుపతి : మన రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ కాన్ఫరెన్స్ ద్వారా మరింతగా మెరుగైన పర్యాటక అభివృద్ధి ప్రణాళిక తయారవుతుందని ఆశిస్తున్నానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ సమావేశ మందిరంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితులు ఆశీర్వచించగా సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం ITPI అండ్ ఆం.ప్ర టూరిజం అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక, అభివృద్ధి సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ… వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య పట్టణ ప్రణాళికలు, పట్టణ ప్రణాళిక డైరెక్టర్‌ల మధ్య ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా, అపెక్స్ బాడీ ఆఫ్ టౌన్ ప్లానర్స్ నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ రంగానికి చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు “ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ టూరిజం ప్లానింగ్ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి” లో భాగస్వాములు అవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ సెషన్లు సాయంత్రం వరకు మేశ్రం ప్రెసిడెంట్ ఐటిపిఐ, కొండ రమేష్ డైరెక్టర్ ఎస్ పి ఎ విజయవాడ వారిచే కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఐటిపిఐ సెక్రటరీ జనరల్ ప్రదీప్ కుమార్, టూరిజం డిప్యూటీ సీఈవో రాముడు, రీజినల్ డైరెక్టర్ ఏ పి టి డి సి రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి రూపెంద్ర నాథ్ రెడ్డి, టూరిజం డి వి ఎం గిరిధర్ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కంట్రీ టౌన్ ప్లానింగ్, టూరిజం శాఖలు వారి ప్రతినిధులు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement