Sunday, May 5, 2024

యోగిబాబుకి గిఫ్ట్ పంపిన స్టార్ హీరో విజ‌య్.. ఆనందంలో క‌మెడియ‌న్

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజ‌య్. కాగా కమెడియన్ యోగిబాబుకు విజయ్ గిఫ్ట్ పంపించాడు.విజయ్, యోగిబాబు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. విజయ్ తాజా చిత్రం ‘వరిసు’లో కూడా యోగిబాబు నటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో మీనా, ఖుష్బూ, జయసుధ, శ్రీకాంత్, శరత్ కుమార్ తదితరులు నటించారు. క్రికెట్ బ్యాట్, హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. విజయ్ గిఫ్ట్ తో యోగిబాబు మురిసిపోయాడు. సోషల్ మీడియా వేదికగా ఫోటో ను షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. యోగిబాబుకు క్రికెట్ అంటే ఇష్టమని తెలుసుకున్న విజయ్… ఆయనకు క్రికెట్ కిట్ ను పంపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement