Tuesday, April 13, 2021

ఏనుగుల దాడిలో ఒక‌రి మృతి..

చిత్తూరు: యాదమరి మండలంలో ఏనుగులు జ‌రిపిన‌ దాడిలో ఒకరు మృతి చెందారు. యాదమరి మండలం బోధ గుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తంజావూరుకు చెందిన దివ్యాంగుడు వెళ్లిగాన్(45) ఏనుగుల దాడిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహ‌న్ని పోస్ట్ మార్ట‌మ్ కోసం త‌ర‌లించారు.. కేసు నమోదు చేసి ఎస్ ఐ సురేష్ విచార‌ణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News