Wednesday, May 8, 2024

బైక్, కారు రేసింగ్ నిర్వ‌హిస్తే.. నాన్ బెయిల‌బుల్ కేసులు : ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ : తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలు చాలా ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి వేడుకలకు ముగింపు పలకాలన్నారు. నగరంలో ప్రధాన కూడలిలో బ్రీత్ అనలైజర్ టెస్టుల‌ను చేయడం జరుగుతున్నదన్నారు. కళాశాల విద్యార్థులు మద్యం తాగి పట్టుపడితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు. కాలేజీ యాజమాన్లకు మందు తాగిన విద్యార్థుల లిస్టులను పంపడం జరుగుతుందని వివరించారు. తిరుపతిలో ఫ్లైఓవర్ రేపు సాయంత్రం నుంచి మూత వేయడం జరుగుతుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రాణానికి ప్రమాదం తెచ్చుకోవద్దని ఎదుటివారి కూడా ప్రమాదం చేయవద్దని కోరారు. నూతన సంవత్సరం 2023 ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా గడపాలన్నారు. బార్లు ప్రభుత్వ మద్యం షాపులు గడువు లోపు మూయడం జరుగుతుందన్నారు. నగరంలో ఆరు హోటల్స్ లో ముందస్తుగా కల్చరల్ కార్యక్రమానికి అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదన‌పు ఎస్పీ లా అండ్ ఆర్డర్ కులశేఖర్, క్రైమ్ అదరపు ఎస్పి విమల కుమారి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సురేందర్ రెడ్డి. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ. క్రైమ్ డీఎస్పీ సురేష్. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రామరాజు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement