Saturday, April 27, 2024

హథీరాంజీ మఠం అధికారి మిశ్రా కు ఉద్వాసన…

హథీరాంజీ మఠం సేవల నుండి మిశ్రాకు ఉద్వాసన పలకాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే హతి రాంజీ మఠం లో పనిచేస్తున్న బసవరాజు అనే సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పై ఫిర్యాదు అందుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ మేరకు స్పందించింది. సెక్యూరిటీ గార్డ్ బసవరాజు ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరణానికి ముందు బసవరాజు ఆత్మహత్య ప్రయత్నం చేసిన సందర్భంలో తన చావుకి కారణం తిరుపతి హతిరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్, మఠం అధికారి మిశ్రా లే కారణమంటూ మరణవాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో హథీరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్, అధికారి మిశ్రా లను పోలీసులు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు మఠం వ్యవహారాలపై సీరియస్ గా స్పందిస్తూ 60 ఏళ్ల పైబడిన వారి సేవలు మఠంలో అవసరం లేదంటూ.. 72 ఏళ్ల వయస్సు కలిగిన అధికారి మిశ్రాను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement