Friday, May 24, 2024

ముగ్గురు దొంగల అరెస్టు.. బంగారు, వెండి, నగదు స్వాధీనం

తిరుపతి సిటీ, ఫిబ్రవరి 21 (ప్రభ న్యూస్): ముగ్గురు దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 355గ్రాములు బంగారు నగలతో పాటు 500 గ్రాముల వెండి వస్తువులు, 30 వేల రూపాయల నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అదనపు ఎస్పి క్రైమ్ విమల కుమారి వివరించారు. వీటి విలువ 13, 25,000 విలువ కలిగిన సూక్తులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత మూడు నెలలుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి క్రైమ్ బృందం నిఘా ఉంచి పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. పాత నేరస్తులు షేక్ సంపత్ జగదీష్ సత్యాతో పాటు బాల నేరస్తుడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా.. 2020 లో ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ వద్ద చేసిన ఒక చైన్ దొంగతనం, గొల్లవానికుంట చిగురువాడ నార్త్ కండిగ చంద్రగిరిలో ఇంట్లో దొంగతనం అలిపిరి బస్టాండ్ నందు చేసిన ద్విచక్ర వాహన దొంగతనాలకు సంబంధించిన కేసుల గురించి దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు.

అలాగే సంపత్, సాత్విక్, వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, నాయుడుపేటలో వరుసగా దొంగతనాలు చేసి జైలుకు పంపించినప్పుడల్లా బెయిల్ పై రావడం తిరిగి యధావిధిగా దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. ఎంఆర్ పల్లి, పోలీస్ స్టేషన్ అలిపిరి, చంద్రగిరి, ఈస్ట్, క్రైమ్, పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారన్నారు. వీరు ముత్యాల రెడ్డి పల్లి, పోలీస్ స్టేషన్ తిరుచానూరు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు కేసు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఇంటి దొంగతనాలు కేసు, డెకైట్ కేసులు కూడా నమోదయ్యాయని, సంపత్ పీలేరు పోలీస్ స్టేషన్ నందు ఆత్మహత్యాయత్నం కేసు కూడా ఉందన్నారు. గత ఆరు నెలల నుంచి జగదీష్ సత్యాలను కలుపుకుని తిరిగి దొంగతనాలు చేస్తూ ఉండేవారన్నారు. కేసులను ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి రివార్డును ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో క్రైమ్ సీఐలు చల్లని దొర, శ్రీనివాసులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement