Wednesday, May 29, 2024

Ambala: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై రోడ్డు ప్ర‌మాదం… ఏడుగురు మృతి

ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఇవాళ తెల్ల‌వారుజామున‌ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబాలా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బులంద్‌షహర్‌ నుంచి భక్తులు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు మినీ బస్సులో వెళ్తున్నారు. తమ మినీ బస్సు కంటే ముందు వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేసిందని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఇతర వ్యక్తులు తెలిపారు. దీంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సమాచారం మేరకు అంబాలాలోని పడవ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దిలీప్ తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని సమీపంలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన వారిలో కొంతమంది సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement