Thursday, May 16, 2024

గౌరీశంకరుల కల్యాణం కమనీయం

శ్రీకాళహస్తీ – శ్రీకాళహస్తిలో వెలసిన గౌరీశంకరుల కల్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా వేలాది మంది భక్తజనం విఐపి వీక్షిస్తుండ‌గా కన్నుల పండుగగా సాగింది.వేదపండితుల మంత్రాలతో ఆలయ ప్రధానార్చకులు మంత్రాలతో బోళాశంకరుడు మంగళ ధారణ‌‌ శాశ్వతంగా భావితరాలకు హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రాధాన్యతను తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల వివాహం ఇలా సాగింది కైలాసనాథ కళ్యాణోత్సవం అంటే శ్రీ కాళహస్తి చుట్టుపక్కల జనానికి ఎంత సంబరం తమ ఇంట్లో వివాహ సంబంధం ఉన్నట్లు భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తజనులు సందడితో పెండ్లి మండపం సందడిగా మారింది. రాత్రి పది గంటలకు బయలుదేరిన స్వామి అమ్మవార్లు భక్తజనకోటి దర్శనమిస్తూ పెళ్లి మండపం వద్దకు విచ్చేశారు. అయితే గతంలో స్వామివారి అమ్మవార్ల కల్యాణం సందర్భంగా గ్రామీణ ప్రాంత నిరుపేద విచ్చేసి వివాహాలు అధిక సంఖ్యలో చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా రానురాను వాహనాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆలయంలోని అలంకార మండపంలో కైలాస నాధుని దేదీప్యమానంగా ముస్తాబు చేసి గ్రామోత్సవం ని ముగించుకొని మొదట ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు వివాహానికి పెద్దగా ముందు విచ్చేయగా తర్వాత అమ్మ వారితో పాటు పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలు విచ్చేసి ఇ ఎదురెదురుగా కూర్చొని కళ్యాణ్ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. నూతన వధూవరులకు ఆలయం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు .వివాహ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన చండీ కేసుని రాయబారాలు ఆకర్షణీయంగా సాగింది స్వామి కల్యాణం జరిగే పెళ్లి మండపం ముస్తాబు చేశారు.
సాంప్రదాయబద్ధంగా మామిడి తోరణాలు కట్టారు వేదిక వద్ద ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవేరి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి కళ్యాణంలో మాంగల్యధారణ గడియలు వేకువజామున నాలుగు గంటలకు ఖరారు చేశారు. వేదమంత్రాలు పట్టిస్తున్న గా కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ అధికారులు ధనపాల్, కృష్ణారెడ్డి, లోకేష్ రెడ్డి, విజయ సారథి, హరి యాదవ్, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులకు తాళిబొట్లు.. నూతన వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదేవుని పెళ్లి తోపాటు నియోజకవర్గ నూతన వధూవరులకు ఇట్లు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూపర్ బజార్ కూడలి కృష్ణారెడ్డి మండపంలో నూతన వధూవరులకు ప్రతి సంవత్సరం దాంతో ఈ సంవత్సరం కూడా డా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు బంగారు తాళిబొట్లు నూతన వస్త్రాలు అందించి మానవత్వం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అం తాళిబొట్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని దాంతో ఈ సంవత్సరం కూడా నూతన వధూవరులకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయ పవిత్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాణి‌పాకం నుంచి పట్టువస్త్రాలు అందించిన ఈ ఓ శ్రీనివాసులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఆదివారం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి ఆలయం తరఫున విచ్చేసిన వారికి ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను అలంకారం తీసుకెళ్లి నూతన వధూవరులకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement