Thursday, May 16, 2024

మేయరే.. కానీ ఆయన ఇల్లు రేకుల షెడ్డు

ఒక్కసారి కౌన్సిలర్ అయితేనే లక్షల రూపాయలు వెనకేసుకునే ప్రజాప్రతినిధులను మనం చూస్తుంటాం. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు నూతన మేయర్‌గా ఎన్నికైన కిరిట్ పర్మార్ ఇప్పటికి రెండు సార్లు కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. కానీ ఇయన ఇప్పటికీ రేకుల ఇంటిలోనే నివాసముంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయన్ను చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంట్లో విలాసవంత వస్తువులేవీ ఉండవు. కాగా కిరీట్ మాట్లాడుతూ.. తాను ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే పెరిగానని, పెళ్లి కూడా చేసుకోలేదని తెలిపారు. సంఘ్ నియమాలకు అనుగుణంగా వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నానన్నారు. తాను జీవితాంతం దేశ సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement