Friday, April 26, 2024

సైంటిస్ట్ గా ఎంపికైన చిరంజీవి

శ్రీకాకుళం : ఎచ్చేర్ల మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన సనపల చిరంజీవి నేషనల్ ఇన్ పార్మాటిక్స్ సెంటర్ సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. యూపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షలో గ్రూప్ – ఏ గెజిటెడ్ కేడర్ లో చిరంజీవి సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫ‌ర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గౌహతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫ‌ర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) లో బీటెక్ పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం గౌహతి ఐఐటీలో ఎంటెక్ చదువుతున్నారు. చదువుతూనే వివిధ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్నారు. సైంటిస్ట్ – బీ గా ప్రస్తుతం ఎంపికయ్యారు. వివిధ ఉద్యోగాల మౌఖిక పరీక్షలకు హాజరయ్యారు. చిరంజీవి తండ్రి భూషణ రావు సహకార శాఖలో సహాయ రిజిస్ట్రార్ గా సేవలు అందిస్తుండగా, తల్లి గృహిణిగా ఉన్నారు. 2020 నవంబర్ 22వ తేదీన ఈ పరీక్ష రాసిన చిరంజీవి, ఈ ఏడాది సెప్టెంబర్ 28 వ తేదీన పరీక్షకు హాజరు కాగా గురువారం పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. చిరంజీవి ఎంపిక పట్ల పలువురు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement