Friday, May 3, 2024

పొత్తులు మార్చ‌డం ప‌వ‌న్ కు అల‌వాటు : మంత్రి బాలినేని

ప్రతి ఎన్నికలకు ఒకసారి పవన్ పొత్తులు మారుస్తున్నారని, పొత్తులు మార్చ‌డం పవన్ క‌ళ్యాణ్‌ కు అలవాటుగా మారిందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికి రెండుసార్లు ఎన్నికలు జరిగితే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారన్నారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్, 2019 ఎన్నికల్లో కమ్యునిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే పవన్ టీడీపీతో పొత్తుకు దిగలేదన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్దమయ్యారని మంత్రి అన్నారు. సీఎం పదవి ఇస్తామంటే పవన్ పొత్తు పెట్టుకున్నా ఒక అర్థముందని, చంద్రబాబును సీఎం చేయడానికి పొత్తు ఎందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఒక ఎన్నికల్లో ఎవరినో ఒకరిని తిట్టడం తర్వాత వారినే పొగడటం పవన్ కల్యాణ్ రాజకీయమ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement