Sunday, April 28, 2024

AP: విద్యుత్ కోతలపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని అన్నారు. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల పేరిటి తెచ్చిన రూ.26 వేల కోట్ల అప్పులు.. చార్జీల పెంపుతో వచ్చిన రూ. 16 వేల కోట్లు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ అవినీతి విధానాలే కారణమని ఆరోపించారు. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. విద్యుత్‌ కోతలతో ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలు నష్టపోతున్నాయని.. పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement