Saturday, May 4, 2024

AP : ఇవాళ శ్రీ‌శైలంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టన

ఇవాళ శ్రీశైలంలో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి చంద్రబాబు హెలికాప్టర్‌ ద్వారా సుండిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

- Advertisement -

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాక్షిగణపతి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని శ్రీశైలంలోని భ్రమరాంబ సదన్‌ అతిథి గృహానికి చేరుకుంటారు. తరువాత క్షేత్రపరిధిలోని బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం తిరిగి హైదరాబాద్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement