Sunday, May 19, 2024

చంద్ర‌బాబుకు షాక్… రిమాండ్ కు ఎసిబి కోర్టు ఆదేశం

విజ‌య‌వాడ – స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి ఎసిబి కోర్టు లో షాక్ త‌గిలింది.. ఆయ‌న‌కు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ..కాగా శ‌నివారం తెల్ల‌వారుఝామున చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు విజయవాడ నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు .సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్‌ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి తుదితీర్పు వెలువ‌రించారు..

కాగా, సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఈనెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చంద్రబాబును కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఆయనను తరలించే ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సెంట్రల్ జైలు వద్ద సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా రాజమండ్రిలో 36 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement