Saturday, May 4, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్ట్

నంద్యాల – స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

టిఫిన్ అనంతరం చంద్రబాబును విజయవాడ తరలించేందుకు సీబీఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తతో నంద్యాలలో కలకలం రేగింది. టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement