Sunday, May 19, 2024

గుండెపోటు వ‌చ్చినా కేర్​ చేయలే.. 21 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్

నర్సరావుపేట, (ప్రభన్యూస్): ఆ బ‌స్సు డ్రైవ‌ర్ సాహసం చేశాడ‌నే చెప్పుకోవాలి. త‌న ప్రాణాల‌మీదికి వ‌చ్చినా బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులే ముఖ్యం అనుకున్నాడు. వారి ప్రాణాల‌ను సేఫ్‌గా కాపాడిన త‌ర్వాత త‌ను గుండెపోటుకు గురైన‌ట్టు గుర్తించాడు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇవ్వాల జ‌రిగింది. గుండెపోటు వచ్చినా గానీ బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికుల ప్రాణాలను బస్ డ్రైవర్ కాపాడాడు. నరసరావుపేట మండలంలోని రావిపాడులో శనివారం జ‌రిగింది. నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పిడుగురాళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో డ్రైవర్ ఆర్ హేమనాయక్ కు రావిపాడు గ్రామం వద్దకు రాగానే గుండెపోటు వచ్చింది.

అయినా గాని డ్రైవర్ హేమ నాయక్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రాణాలను కాపాడాలనే ద్వేయంతో గుండె నొప్పిని భరిస్తూ బస్ ను సురక్షితంగా పక్కకు తీసి స్టీరింగ్ పైనే పడిపోయాడు. ప్రయాణికులు, గ్రామస్తులు డ్రైవర్ ను నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విధినిర్వహణలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 21 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ హేమ నాయక్ ను గ్రామస్తులు, బస్ లోని ప్రయాణికులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement