Friday, May 3, 2024

కొత్త జిల్లాలకు నిధుల ప్రస్తావన లేని బడ్జెట్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రస్తావన చేసినప్పటికీ నిధుల కేటాయింపు ఊసెత్తలేదు. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాలను పునర్విభజిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సమర్థవంతమైన పాలన అందించడం ద్వారా సుస్థిరమైన వృద్ధి వైపు వెళుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు నిర్ణయించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఇప్పుడున్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విభజించి 26 జిల్లాలను ఏర్పాటు చేస్తోంది.

ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందంటూ ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో కూడా పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కార్యాలయాలకు మౌళిక వసతుల కల్పన వంటి వాటికి నిధుల ఎలా అనేదానిపై మాత్రం బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి ప్రస్తావించలేదు. జిల్లాల పునర్విభజన చేస్తున్నామనడం మినహా ఇప్పటి వరకు నిధుల అంశాన్ని ఎప్పుడూ కూడా ప్రకటించ లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement