Friday, May 3, 2024

నాటు పడవ బోల్తా ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా..

విశాఖపట్నం జిల్లా సిలేరు రిజర్వాయర్ లో నాటు పడవు బోల్తా ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. పడవ ప్రమాదంలో మృతులు కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన మంత్రి ఆళ్ల నాని…సత్వరమే గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని అదేశించారు. పడవ బోల్తా ఘటనలో 8 మంది గల్లంతు అయ్యారని.. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డు కు చేరుకున్నట్టు మంత్రి ఆళ్ల నానికి తెలిపారు DMHO డాక్టర్ సూర్య నారాయణ. పడవ ప్రమాదం బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు మంత్రి. ఇక గల్లంతు అయిన వారంతా కొందుగూడ గ్రామస్తులుగా గుర్తించారు పోలీసులు. బాధితులు అందరూ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై పాడేరు శాసన సభ్యులు భాగ్య లక్ష్మి తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మంత్రి. పడవ ప్రమాదంలో బాధితులకు అండగా నిలవాలని అధికారులకు అదేశించారు మంత్రి ఆళ్ల నాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement