Saturday, April 27, 2024

త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదు.. పొత్తులపై సోము కీలక వ్యాఖ్యలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఇటీవల కొందరు త్యాగానికి సిద్దంగా ఉన్నట్లు మట్లాడుతున్నారని, పలు సందర్భాల్లో ఆ త్యాగం గమనించామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యంగ్యోక్తి విసిరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపిని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, ఇందుకు తెదేపా నాయకత్వం వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే తాను త్యాగాలకు సిద్దంగా కూడా ఉన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు పరోక్షంగా స్పందించారు.

ఆ తరహా త్యాగాలను గతంలోనే తాము గమనించామని చెపుతూ వాటిని భరించేందుకు ఏపీ బీజేపీ సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉందని చెపుతూ కుటు-ంబ పార్టీలకోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. త్యాగధనులంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తాము అవినీతి రాజకీయాలకు, కుటు-ంబ పార్టీలకు వ్యతిరేకమనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. గత కొంతకాలంగా పొత్తులపై వస్తున్న వివిధ ఊహాగాలు, అధికార వైసీపీ ఇస్తున్న కౌంటర్ల నేపధ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement