Wednesday, June 12, 2024

AP: పాత కక్షలతో దాడి.. వ్యక్తి మృతి

బేతంచెర్ల : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం, రుద్రవరం గ్రామంలో జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతిచెందిన సంఘటన వెలుగు చూసింది. రుద్రవరంకు చెందిన హరి ప్రసాద్ పై శనివారం రాత్రి ఆయన ప్రత్యర్థులు దాడి చేసి గాయపరిచారు. వర్గ కక్షల నేపథ్యంలో హరిప్రసాద్ పై దాడి చేసినట్లు సమాచారం.

తీవ్ర గాయాలు కావ‌డంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిప్రసాద్ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement