Friday, May 31, 2024

TS: బంద్ ను విజ‌య‌వంతం చేయాలి… రోడ్డుపై చెట్ల‌ను న‌రికేసిన మావోయిస్టులు

చర్ల, మే 26 (ప్రభ న్యూస్) : చత్తీస్ గ‌ఢ్‌ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లకు నిరసనగా సౌత్ సబ్ జోనల్ బ్యూరోలో సమ్మెను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ పేరుతో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు పూసగుప్ప, వద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న లోటెంత వాగు బ్రిడ్జికి ఇరువైపులా భారీ చెట్లను నరికి ప‌డేయడంతో పక్కనే ఉన్న కరెంటు స్తంభాలు విరిగిపోయి వద్దిపేట, పూసగుప్ప బేస్ క్యాంపులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


బంద్ ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ పేరుతో పలుచోట్ల కరపత్రాలను రోడ్లపై వదిలారు. అలాగే పాసిస్టు ఆపరేషన్ కాగర్ అణిచివేత కింద బస్తర్ లో జరుగుతున్న మారణకాండలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటూ అటవీ ప్రాంతాల్లోని పలు చెట్లకు కరపత్రాలను అంటించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరుగుతున్న బంద్ నేపథ్యంలో మారుమూల దండకారణ్య అటవీ ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు ఈ క్షణాన ఏం జరుగుతుందోనని భయోందనళకు గురవుతున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement