Saturday, June 1, 2024

AP : భార్య గొంతుకోసి హ‌త్య చేసిన భ‌ర్త‌

నంద్యాల జిల్లా: భార్య గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన ఆదివారం కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లి చోటు చేసుకుంది. కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన వడ్డే సుగుణమ్మ(54) గత కొంత కాలం నుండి తన భర్త అయినా వడ్డె రమణతో సరిపడక పక్కన ఉంటూ ఉండేది.

- Advertisement -

తాగుడుకు బానిసైన రమణ గత రాత్రి తన ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న సుగుణమ్మ వద్దకు వెళ్లి ఇష్టమొచ్చినట్లుగా నరికాడు.. ఆదివారం తెల్లవారుజామున మృతురాలి పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ర‌మ‌ణ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement