Monday, April 29, 2024

హైదరాబాద్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ హాస్పిటల్‌ ప్రారంభం..

అమరావతి, ఆంధ్రప్రభ: పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి ఏపీఎస్‌ ఆర్టీసీ నుంచి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని తార్నాక ఒకటో నంబర్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ ఆర్టీసీ డిస్పెన్సరీని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వామ్యంతో 2017లో విజయవాడ విద్యాధరపురంలో సెంట్రల్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. అప్పటికే ఆర్టీసీలో పని చేస్తూ పదవీ విరమణ చేసిన రెండు వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందక తప్పనిసరి పరి స్థితుల్లో విజయవాడ వస్తున్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో వైద్యశాల ఏర్పాటుకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి అభ్యర్థనను పరిగణలోకి పరిశీలించిన ఎండీ తిరుమలరావు విజయవాడ వచ్చేం దుకు ఉన్న వ్యయ ప్రయాసలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి పూర్తిస్థాయిలో పని చేసేందుకు సీనియర్‌ వైద్యాధికారిని, సీనియర్‌ ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఇతర సిబ్బందితో పాటు వైద్య పరి కరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఇందులో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత పరీక్షలు, మందులను అందజెయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం రెండు వేల మంది డ్రైవర్లు, కండక్టర్‌ సిబ్బంది కూడా రాకపోకలు సాగిస్తుంటారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి కూడా ఇక్క డ వైద్య సదు పాయాలు అందిం చేం దుకు అధికా రులు ఏర్పాట్లు చేశారు. అవసరమైన పక్షంలో సూపర్‌ స్పెషా లిటీ ఆసుపత్రు లకు రిఫర్‌ చేసేందుకు సైతం ఇక్కడి వైద్యాధికారి నిర్ణయం తీసుకునే అవకా శాన్ని ఉన్నతాధి కారులు కలిపించారు.

ఇదే సమ యంలో ఆర్టీసీ బస్సుల నిర్వ హణ, రద్దీ తదితర వ్యవహా రాలను పర్యవేక్షిం చేందుకు విధుల నిర్వహణలో భాగంగా బస్‌ భవన్‌, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్‌లో పని చేస్తున్న ఉద్యోగు లకు కూడా ఈ వైద్యశాలలో సేవ లు పొందేం దుకు అవకాశం ఉందని ఎండీ తిరు మల రావు ఈ సం దర్భంగా పేర్కొన్నారు. ఈ కార్య క్రమం లో ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌(పరిపాలన) ఏ.కోటేశ్వ రరా వు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అప్పారావు, ఆర్టీసీ ఆర్థిక సల హాదారు రాఘవరెడ్డితో పాటు పదవీ విర మణ చేసిన ఉద్యోగులు పాల్గొన్నారు. తమకు ఉప యోగపడేలా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఎండీ తిరు మలరావుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement