Thursday, April 25, 2024

Flash: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయు హౌస్ అరెస్ట్

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జె బ్రాండ్, కల్తీసారాలపై నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు వారి ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక సమాజంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. హౌస్ అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోతే ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసన తెలిపేందుకు వీలు లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కారణాలు చెప్పకుండా పోలీసులు ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అని అన్నారు. పోలీసులు జగన్ రెడ్డికి తొత్తులుగా మారి అర్ధరాత్రి నుంచి ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం ప్రజలలోకి వెళితే జగన్ రెడ్డికి ఉలుకెందుకు? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement