Thursday, May 2, 2024

విద్యారంగంలో ఎపిని నెంబర్ 1 స్థానంలో నిలిపిన సిఎం జ‌గ‌న్ -మంత్రి జోగి

పామర్రు( కృష్ణాజిల్లా), జూన్ 28 – జగనన్న విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జగనన్న అమ్మఒడి నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించి బటన్ నొక్కి నగదు తల్లుల ఖాతాలలో జమ చేశారు. జిల్లాస్థాయి కార్యక్రమం పామర్రు లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులుతో కలిసి జగనన్న అమ్మఒడి పథకం కింద జిల్లాలో 1,29,533 మంది తల్లులకు రు.194.30 కోట్ల రూపాయల నమూనా చెక్కును తల్లులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలోని అప్పటి పాఠశాలల పరిస్థితులు విద్యార్థుల పరిస్థితులు చూసి చలించి ముఖ్యమంత్రి కాగానే విద్యా రంగంలో సమూల మార్పులు సంస్కరణలు చేపట్టారన్నారు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో అమ్మ ఒడి కింద ఏడాదికి 15000 రూపాయలు జమ చేస్తూ విద్యను పేదలకు చేరువ చేశారని అన్నారు నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి చేపట్టి ప్రైవేట్ కాన్వెంట్ల, కార్పొరేట్ పాఠశాలల్లో ఉండే వసతులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించారన్నారు. ఉన్నత వర్గాల పిల్లలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారనీ అన్నారు. అమ్మ ఒడి జగనన్న బడిగా మంత్రి అభివర్ణించారు. మచిలీపట్నం పోర్టు శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. మచిలీపట్నం విజయవాడ హైవే త్వరలో 6 లైన్ల రహదారిగా అభివృద్ధి కానున్నదని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్లకు పంపేందుకు మొగ్గు చూపేవారని, తమ పిల్లలు ఫలానా కాన్వెంట్లో చదువుతున్నారని ఘనంగా చెప్పుకునేవారని అన్నారు అయితే మన ప్రభుత్వం ప్రైవేటు కాన్వెంట్లలో కార్పొరేట్ పాఠశాలల్లో ఉండే సౌకర్యాల కంటే మించిన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించిందని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని అన్నారు. పాఠశాలలు తెరిచిన రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, షూస్, స్కూల్ బ్యాగ్ వంటి జగనన్న కిట్టు విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి డిజిటల్ బోధన అందించడం ద్వారా విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగై మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతారని అన్నారు. రోజుకో రకమైన పోషకాలతో కూడిన మెనూ విద్యార్థులకు అందించడం ద్వారా వారి మానసిక ఆరోగ్య పరిస్థితులు మెరుగై ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. పేదరికం నుంచి బయట పడాలంటే విద్య ఏకైక మార్గం అన్నారు

పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు చదువు ఒక్కటే మార్గమని భావించి దివంగత వైయస్సార్ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వంటి పలు పథకాలు విద్యాబిృద్ధికి అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో నేడు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి అన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ పేదల జీవితాలు బాగుపడాలంటే విద్య ఒకటే మార్గం అన్నారు
డీఈవో తహెరా సుల్తానా జిల్లాలో అమ్మ ఒడి పథకం అమలు వివరాలు తెలియజేశారు
ఉప విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు , రాష్ట్ర ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, పామర్రు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్ జడ్పిటిసి కూనపరెడ్డి స్వరూప రాణి, సర్పంచ్ కే కస్తూరి, నియోజకవర్గ పరిధిలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement