Saturday, April 27, 2024

ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి  సీరియస్‌ అయింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్ట్‌ 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్ట్‌ 1న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హాజరుకావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఆగస్టు మొదటి వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement