Friday, April 26, 2024

ఏపీలో థియేటర్లకు 100% ఆక్యుపెన్సీ.. ఆ సినిమాలకు కాసులే..

సినీ ప్రియులుకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి రానుంది. కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్‌ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దసరా సందర్భంగా విడుదల కానున్న సినిమాలు థియేటర్లకు సందడి చేయనున్నాయి. మహా సముద్రంతో పాటు దసరాకు కానుకగా విడుదలవుతున్న అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, పెళ్లి సందడి సినిమాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సినిమాలు కలెక్షన్లు మంచిగా రాబట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు పాలమూరు

Advertisement

తాజా వార్తలు

Advertisement