Friday, May 3, 2024

మాకు 70, తెలంగాణకు 30 శాతం జలాలు పంచండి: కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం కొనసాగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ బోర్డుకు లేఖ రాసింది. ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చే వరకు ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లోని నీటిని పంచాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. తీర్పు వచ్చే వరకు నీటిని నిష్ఫత్తి ప్రాతిపదికన పంచాలని ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. తమకు 70 శాతం, తెలంగాణకు 30 శాతం నీటిని పంచాలని అందులో కోరింది ఏపీ. అలాగే, నాగార్జున సాగర్ ఎడమ విద్యుత్ కేంద్రం, పులిచింతలలో ఉత్పత్తి చేసే విద్యుత్‌లోనూ తమకు వాటా ఇవ్వాలన్నారు.

మరోవైపు, గతేడాది 66:34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకున్నామని, ఈసారి దానిని 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ఇప్పటికే కృష్ణా బోర్డును కోరడం, ఈ నెల 27న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చిన నేపథ్యంలో ఏపీ తాజాగా లేఖ రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీశైలంలో 884.90 అడుగుల మట్టంలో నీటి నిల్వ ఉండగా.. తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల బుధవారం నాటికి నీటి మట్టం 879.3 అడుగులకు తగ్గిపోయింది.

ఇది కూడా చదవండి: ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని సీఎం జగన్ కు లేఖ రాసిన లోకేశ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement